Election Commission: ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల లే అవుట్ మార్చడానికి ఈసీ నిర్ణయించుకుంది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. ఎన్నికల నిర్వహణ నియమాలు-1961లో నియమం 49B ప్రకారం, ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు కలర్లో ముద్రించనున్నారు. ఈవీఎంలపై ఇకపై పోటీ చేస్తున్న అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఇంతకుముందు, దీని స్థానంలో అభ్యర్థుల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండేవి. కలర్ ఫోటోలతో ఓటర్లు అభ్యర్థుల్ని స్పష్టంగా గుర్తించవచ్చు.
Read Also: KTR : ఎల్‌అండ్‌టి మెట్రో ప్రాజెక్టు నుంచి వెనక్కి.. సీఎం బెదిరింపులే కారణం
కేటాయించిన ఫోటో స్థలంలో మూడొంతుల భాగాన్ని కలర్ ఫోటో ఆక్రమిస్తుంది. తద్వారా ఓటర్ల ముఖాలను మరింత స్పష్టంగా చూడగలరు. దీనికి తోడు బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి సీరియల్ నంబర్ ముద్రించనున్నారు. ఈవీఎంలపై 20 ఎంఎం సైజులో అభ్యర్థి కలర్ ఫోటో, 40 ఎంఎం సైజులో పార్టీ సింబల్ ఉంటుంది.
గతంలో పేరు, పార్టీ చిహ్నం, సీరియల్ నంబర్ వంటి ప్రాథమిక అభ్యర్థి వివరాలు మాత్రమే ఉండేవి. ఫోటోలు ఉంటే ఉండేవి లేకుంటే మోనోక్రోమ్లో ఉంటాయి. ఫోటోల సైజు చాలా చిన్నగా ఉండేది. సవరించిన నిబంధనలతో ఓటర్లు మరింత క్లారిటీతో తాము ఓటేయాలనుకునే అభ్యర్థిని గుర్తించవచ్చు. పోలింగ్ బూత్‌లో గందరగోళాన్ని తగ్గించడానికి డిజైన్, ప్రింట్‌ను రెండింటినీ మార్చారు.