Bihar Assembly Election Results: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత EVMల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం అవసరమైన అన్ని సన్నాహాలు చేసింది.
Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు కనిపించాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రశ్నించింది. "సమస్తిపూర్ సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఈవీఎంల నుంచి పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు విసిరేశారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి ఆదేశం మేరకు ఈ స్లిప్పులు విసిరేశారు..?…
2025 అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ ప్రజలపై ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు రూ.30,000 ఒకేసారి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే రైతులకు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, వరిపై 300 రూపాయలు, గోధుమలపై 400 రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి దశకు…
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కౌంట్‌డౌన్ మొదలైంది. నేటితో మొదటి దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచార గడువు ముగియగానే.. నియోజకవర్గాల నుంచి నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం (ఈసీ)ఇప్పటికే స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తల ఎవరూ సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. గురువారం (నవంబర్ 6) తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.…
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమి సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అన్ని పార్టీల సీనియర్ నాయకులు ఇప్పటికే రాష్ట్రంలో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బీహార్‌లో ర్యాలీలు నిర్వహించారు. ఆదివారం ఆయన బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్…
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఈరోజు జేడీయూ ప్రకటించింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత జేడీయూ అభ్యర్థుల ఈ జాబితాను విడుదల చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ.. ఎన్డీఏ ఐక్యంగా ఉందని, బీహార్ అభివృద్దే తమ లక్ష్యం అని చెప్పారు. ఇటీవల ఎన్డీఏ కూటమితో జేడీయూ సీట్ల పంపకాల ఒప్పందం…
Bihar Assembly Elections 2025: దేశ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఒంటరి పోరుకు సిద్ధమై తొలి విడతలో భాగంగా 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత…
Supreme Court: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో విపక్షాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ కార్యక్రమం ద్వారా ఫేక్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంని ఆశ్రయించాయి.
Election Commission: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల లే అవుట్ మార్చడానికి ఈసీ నిర్ణయించుకుంది. ఎన్నికల నిర్వహణ నియమాలు-1961లో నియమం 49B ప్రకారం, అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు కలర్‌లో ముద్రించనున్నారు.