Milind Deora: కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా ఆ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. దీనిపై సీఎం షిండే స్పందించారు. మిలింద్ దేవరా శివసేనలో చేరానుకుంటే అతడిని స్వాగతిస్తామని అన్నారు. మహారాష్ట్రలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఆ పార్టీకి రాజీనామా చేయడం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభించే రోజే పార్టీ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. దక్షిణ ముంబై మాజీ ఎంపీ అయిన మిలింద్ దేవరా, కాంగ్రెస్-ఉద్దశ్ ఠాక్రే వర్గాల మధ్య సీట్ల పంపిణీ అంశంపై అసంతృప్తితో ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Housing Crisis: భారత విద్యార్థులకు కెనడా షాక్..? హౌసింగ్ సంక్షోభం నేపథ్యంలో పరిమితి..
దేవర కుటుంబం 55 ఏళ్లుగా కాంగ్రెస్తో ఉంది. ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసిందని, తాను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తు్న్నట్లు మిలింద్ దేవరా ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా శివసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ రాజీనామా అంశం చర్చకు వచ్చింది. ఇటీవల శివసేన పార్టీ, ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పు వెల్లడించారు. అసలైన శివసేన ఏక్ నాథ్ షిండేదే అని చెప్పిన మూడు రోజుల తర్వాత మిలింద్ దేవరా రాజీనామా చోటు చేసుకుంది.