ED: క్యాసినో నౌకలో ఈడీ అధికారుల సోదాలు.. దాడికి దిగిన నిర్వహకులు
- గోవాలోని ఆఫ్‌షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో ఈడీ సోదాలు..
- ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన క్యాసినో నిర్వహకులు..
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నిందితుల వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED: ప్రస్తుతం భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వరుస దాడులు జరగటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఓ కేసు నేపథ్యంలో క్యాసినో నౌకలో తనిఖీల కోసం ఈడీ అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. గోవాలోని ఆఫ్‌షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో సోదాలు నిర్వహించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పోలూరి చెన్నకేశవరావుతో పాటు మరో ఇద్దరు సిబ్బంది వెళ్లగా.. వారిపై క్యాసినో డైరెక్టర్, అతడి అనుచరులు దాడి చేసినట్లు గోవా పోలీసులు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
Also Read
అయితే, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తాము స్వాధీనం చేసుకున్న ఆధారాలను సైతం నాశనం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మమల్ని నిందితులు బెదిరించారని వారు వెల్లడించారు. గత నెలలో ఢిల్లీలోని బిజ్వాసన్ ఏరియాలో ఓ సైబర్ మోసం కేసును ఈడీ అధికారులు విచారణ చేస్తుండగా.. పలువురు దుండగులు వారిపై దాడి చేశారు. అలాగే, జనవరిలో పశ్చిమ బెంగాల్‌ల్లోని సందేశ్‌ఖాలీలో కేసు దర్యాప్తుకు వెళ్లిన ఈడీ అధికారులపై స్థానికులు దాడి చేయడంతో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. క్రమంగా అధికారులపై దాడులు పెరిగిపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..