ED: ప్రస్తుతం భారతదేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వరుస దాడులు జరగటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఓ కేసు నేపథ్యంలో క్యాసినో నౌకలో తనిఖీల కోసం ఈడీ అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.