పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.