దేశంలో భారత 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది.
గురువారం రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు.. రాష్ట్రపతి ఎన్నికల ప్రధానంగా బరిలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలకు ఓకే చెప్పారు..
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తికావడంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించింది. ఈనెల 24న శుక్రవారం నాడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మూకు ఏపీలోని వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు ఇవ్వడం శుభ…
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠకు విపక్షాలతో పాటు అధికార పక్షం తెరదించింది.. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన విపక్షాలు సుదీర్ఘ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దించగా.. ఇక, అనూహ్యంగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పెడితే బాగుంటుంది? అనే విషయంపై చర్చించిన తర్వాత.. 64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్‌ను పోటీకి పెట్టాలని నిర్ణయానికి వచ్చారు.. ఆ తర్వాత ఏర్పాటు…
రాష్ట్రపతి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ కాగా.. జూలై 18న ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం జూలై 24నాటికి పూర్తికానుంది. ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల తరఫున దీటైన ఉమ్మడి…