WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా ఛేదించే జట్లు విజయాన్ని అందుకుంటున్న తరహాను కొనసాగిస్తూ, యూపీ వారియర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వడోదరా వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అనాబెల్ సదర్లాండ్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..
Read Also: GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ జట్టు ఓపెనర్ కిరణ్ నవగిరె మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేసింది. శ్వేత సెహ్రావత్ (37 పరుగులు; 4 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టింది. ఇక ఆ తర్వాత 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 69; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అనాబెల్ సదర్లాండ్ 41 నాటౌట్ తో అదరగొట్టింది. మరిజాన్ కాప్ 29 నాటౌట్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
Read Also: Nizamabad: ఆటో కోసం స్నేహితుడి హత్య.. అంతటితో ఆగకుండా?
షఫాలీ వర్మ 26 పరుగులతో రాణించి ఓపెనింగ్‌లో చక్కటి ఆరంభాన్ని అందించింది. యూపీ బౌలర్లలో సోఫియా, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్ తలా ఒక వికెట్ తీశారు. అయినప్పటికీ ఇన్నింగ్స్ మధ్యలో క్యాచ్ మిస్సింగ్, రనౌట్ అవకాశాలు చేజార్చుకోవడం వల్ల మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక బెంగళూరులో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. రెండు జట్లు తమ విజయ పరంపరను కొనసాగిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.