బీహార్‌లో నెలకొన్న హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ వేదికపై నియామక పత్రాలు అందజేశారు. ఆ సందర్భంగా ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వేదికపైకి వచ్చింది. అయితే నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఒక మహిళ హిజాబ్‌ను ఎలా తొలగిస్తారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదు
ఇదిలా ఉంటే ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న సదరు వైద్యురాలు నుస్రత్ పర్వీన్ ఇప్పటి వరకు విధుల్లో చేరలేదని అధికారులు వెల్లడించారు. అయితే నియామక పత్రాలు అందుకున్న వైద్యులంతా గురువారంలోపు (జనవరి 1) చేరాలని డెడ్‌లైన్ ఉంది. అది మరికొన్ని గంటల్లో ముగియనుంది. కానీ వైద్యురాలి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఆమె సబల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరాల్సి ఉండగా ఎటువంటి సమాచారం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Peddireddy Ramachandra Reddy: జగన్ మళ్లీ సీఎం అయితేనే ఆ నిజానిజాలు బయటకు వస్తాయి..
అయితే ఈరోజు గనుక విధుల్లో చేరకపోతే ఆమె అపాయింట్మెంట్ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే హిజాబ్ వివాదం తర్వాత వైద్యురాలి కుటుంబం బీహార్‌ను విడిచిపెట్టి పశ్చిమ బెంగాల్‌కు మకాం మార్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆమె విధుల్లో చేరలేనట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.