NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి వ్యతిరేకంగా తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్ పరీక్షను గత కొంత కాలంగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించాలని డీఎంకే లక్ష్యంగా…