Karnataka Congress Crisis: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు బహిర్గతం అయింది.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట.. ఒక పీడకలగా మారింది అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా పేర్కొన్నారు. ఒక వైపు, తొక్కిసలాట జరిగిన అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటే.. వేదికపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాత్రం క్రికెటర్లతో కౌగిలింతలు, ఫోటోలు తీసుకోవడంతో చాలా బిజీగా ఉన్నారని ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గుత్తేదార్ కలబురగి జిల్లా అఫ్జల్‌పూర్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా పని చేశారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలన్నింటిని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు.