DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి రైతులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
భవిష్యత్తులో కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అవసరమని డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలోని నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకోవాలంటే నదుల అనుసంధానం కీలకమని పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ సమస్యలకు పరిష్కారం కనుగొంటామని చెప్పారు. తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునర్నిర్మాణం రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనమని పేర్కొన్న డీకే శివకుమార్, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. అనంతరం “జై కర్ణాటక, జై ఆంధ్ర, జై తెలంగాణ” అంటూ నినాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
కాగా, కర్ణాటక వేదికగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది.. ముగ్గురు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి) ఒకే వేదికపై చేతులు కలిపారు. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాట్లాడిన డీకే శివకుమార్.. తాను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురం కలిపి చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు..
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!