Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
Uttam Kumar Reddy: చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ. 80 కోట్లు ఖర్చు చేసి, నీటిని ఆయకట్టుకు అందజేయాలని ప్రభుత్వ ప్రణాళిక ఉందన్నారు.…
Thatikonda Rajaiah : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనమని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, కడియం మాటలు..అబద్దాల మూటలు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ కు ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియంను గెలిపిస్తే..రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, సక్రమ…
Kadiyam Srihari: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల…
Komatireddy Venkat Reddy : నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని, SLBC, బ్రాహ్మణవెళ్ళాంల నాకు ప్రథమ ప్రాధాన్యమన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని, కాంట్రాక్టర్ పని చేయకపోతే మంత్రి గారికి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ ప్రజల దశబ్దాల కల SLBC…
Nimmala Ramanaidu : 2014 నుంచి ఇరిగేషన్ శాఖ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ కడపజిల్లా జమ్మలమడుగులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్విర్యం అయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ కు చిన్న పని కూడా చేయలేదన్నారు. చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసిపి పాలనలో చేయలేకపోయారని, గాడి…