Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
- హర్యానా బీజేపీలో అలకలు
- టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
- సీఎం సైనీకి షేక్ హ్యాండ్ ఇవ్వని మాజీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తు్న్నారు. అయితే నాయకుల మాత్రం.. ముఖ్యమంత్రికి కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. కోపంతో రగిలిపోతున్నట్లుగా నాయకుల ముఖాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
హర్యానా ఓబీసీ మోర్చా నాయకుడు, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్‌కి ఈసారి టికెట్ లభించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు మాజీ మంత్రి ఇంటికి సీఎం సైనీ వెళ్లారు. కానీ సైనీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే కూర్చున్న.. కనీసం ఆయన ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపడలేదు. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకుంటూ వచ్చిన మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి షేక్ హ్యాండ్ ఇవ్వగా.. చేతులు వెనక్కి లాక్కు్న్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కాంబోజ్.. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్ పదవికి కూడా రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
బీజేపీకి విధేయులు అవసరం లేదనుకుంటా? అని కరణ్ దేవ్ కాంబోజ్ వ్యాఖ్యానించారు. సంవత్సరాలుగా సేవ చేసిన వారిని బీజేపీ విస్మరించిందన్నారు. ఒక రోజు ముందు పార్టీ మారిన వారికి టికెట్లు ఇచ్చారని కాంబోజ్ ఆరోపించారు. మరో వీడియోలో జాబితాలో పేరులేనందుకు సోనిపట్‌లో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కవితా జైన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసినట్లు తెలిపారు. కనీసం హాస్టల్లో ఉన్న కూతురిని కూడా చూడలేదని.. అంతగా పార్టీ కోసం కష్టపడినట్లు వివరించారు.
మరో బీజేపీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్‌కు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ వస్తుందని ఆశించానని.. తీరా చూస్తే తనకు టికెట్ రాలేదని వాపోయారు. తన పేరు పరిశీలనలో ఉందని తన నియోజకవర్గ ప్రజలకు చెప్పానన్నారు. కానీ తీరా చూస్తే టికెట్ దక్కలేదని రంజన్ కంటతడి పెట్టారు.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవలే కమలం పార్టీ 67 స్థానాలకు తొలి జాబితాను ప్రకటించింది. ఇంకా 23 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Guntur Crime: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు.. అడిగితే కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపేస్తారు..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!