హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.