Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- పాకిస్తాన్లో హిందూ బాలికల కిడ్నాప్, మతమార్పిడి, బలవంతపు పెళ్లి..
- సింధ్ కోర్టు ముందు కన్నీర పెట్టుకున్నా తల్లిదండ్రులతో పంపించని కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Hindu Girls: పాకిస్తాన్లో మైనారిటీ హిందూ, క్రిస్టియన్ ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో హిందూ బాలికల అపహరణ, మతమార్పిడి. బలవంతంగా పెళ్లి చేసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. అక్కడి పోలీస్, న్యాయ వ్యవస్థ కూడా ఈ అమ్మాయిలకు సాయం చేయడం లేదు. తాజాగా ఇద్దరు హిందూ బాలికలు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తామని కన్నీరు పెట్టుకున్నా కూడా కోర్టు వారిని షెల్టర్ హోమ్‌కు పంపించింది. తమ కుమార్తెలను అపహరించి, ఇస్లాంలోకి మార్చి బలవంతంగా ఇద్దరు యువకులు పెళ్లి చేసేుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సింధ్‌లోని టాండో అల్లహ్యార్ జిల్లాకు చెందిన 13, 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికల్ని అమ్జద్ సోలంగి, మన్సూర్ సోలంగి అనే ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నట్లు హక్కుల కార్యకర్తలు, బాధిత కుటుంబీకులు ఆరోపించారు. కిడ్నాప్ కేసులో ఇద్దరు బాలికల్ని కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో పంపించకుండా రెండు రోజుల పాటు సేఫ్ హౌజ్‌లకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు వెలుపల బాలికలు కన్నీరు పెట్టుకుంటూ తమను ఇంటికి పంపించాలని పదేపదే వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
10 రోజుల్లో ఆరుగురు హిందూ బాలికల అపహరణ..
ఈ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనే టాండో అల్లాహ్యర్ జిల్లాలో 14 ఏళ్ల బాలిక పాన్సీ కోహ్లీ సెప్టెంబర్ 9న కిడ్నాప్‌కు గురైనట్లు హక్కుల కార్యకర్త తెలిపారు. 10 రోజుల వ్యవధిలో ఈ జిల్లాలో ఆరుగురు హిందూ మైనర్ బాలికలు అపహరణకు, మతమార్పిడికి గురైనట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా కోహ్లీ, భీల్, మేఘ్వార్ వంటి అణగారిన వర్గాలకు చెందిన పేద కుటుంబాలు పోలీసు వ్యవస్థ, న్యాయ సహాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో తక్కువ అవకాశాలతో మరింత సున్నిత పరిస్థితుల్లో ఉన్నాయని మైనారిటీ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషన్ కూడా పాకిస్తాన్లో వందలాది మంది హిందూ బాలికలు కిడ్నాప్‌కు గురవుతున్నారని, బలవంతపు వివాహాలను ఎదుర్కొంటున్నారని చెబుతోంది.
బాలికల వయసు 13, 14 ఏళ్లుగా తేలితే, సింధ్ చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రెయింట్ యాక్ట్, 2013 ప్రకారం వారు పిల్లలుగా పరిగణించబడతారు. ఈ చట్టం ప్రకారం పురుషులు, మహిళలు ఇద్దరికీ వివాహ కనీస వయసు 18 సంవత్సరాలు. ఇప్పుడు వీరి వయసును నిర్ధారించాల్సి ఉంది.
Minor #Hindu girls Sita & Rupi stood in court, crying: “We want to go home.” Pakistan’s system still silences them. CHILDREN turned into brides. How many more before the state admits its crime? 1/3 pic.twitter.com/PxKfGDIvUY
— Mohsin Haider (@mohsin_haider_d) September 10, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!