Renuka Swami Murder:రేణుకాస్వామిని తన్నిన షూ విజయలక్ష్మి ఇంట్లో.. మూడు బైకులు సీజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Shoe Found at VIjayalakshmi House in Renuka Swami Murder Case: రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి, దాడి సమయంలో నటుడు దర్శన్ ధరించిన బూట్లు అతని భార్య విజయలక్ష్మి ఇంట్లో లభ్యమయ్యాయి. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హొస్కరేహళ్లిలోని విజయలక్ష్మి ఇంట్లో దర్శన్ బూట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులు రేణుకాస్వామిని పట్టనగెరెలోని ఓ షెడ్డులో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం దర్శన్ షెడ్డు నుంచి నేరుగా రాజరాజేశ్వరి నగర్ లోని తన ఇంటికి వెళ్లి బట్టలు, బూట్లు మార్చుకుని స్నానం చేసి మైసూరుకు బయల్దేరాడు. అనంతరం దర్శన్ పనిమనిషి బూట్లను హొస్కెరేహళ్లిలోని విజయలక్ష్మి ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచారు. రాజరాజేశ్వరి నగర్‌లోని దర్శన్ ఇంటి నుంచి హత్య జరిగిన రోజు దర్శన్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బూట్లు మాత్రం కనిపించలేదు.
Actor Darshan case: చెవి లేదు, వృషణాలపై తీవ్రగాయాలు.. చిత్రహింసలు పెట్టి హత్య..
Also Read
దీనిపై నిందితులను విచారించగా దర్శన్ ఇంటి పనిమనిషి ఆ బూట్లను విజయలక్ష్మి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు విజయలక్ష్మి ఇంటికి వెళ్లి ఆ బూట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక నటుడు దర్శన్ సహచరుల మూడు బైకులను పోలీసులు మంగళవారం జప్తు చేశారు. హత్యకేసుకు సంబంధించి పోలీసులు దర్శన్ సహచరులు నందీష్, పవన్, ధనరాజ్ అలియాస్ రాజులను రాజరాజేశ్వరినగర్ ఐడియల్ హోమ్స్ లేఅవుట్‌లోని దర్శన్ ఇంటికి తీసుకొచ్చారు. ఈ సమయంలో దర్శన్ ఇంటి ఆవరణలో పార్క్ చేసిన యాక్సిస్, హోండా యాక్టివా సహా మూడు స్కూటర్లను టాటా ఏస్ ఆటోలో ఎక్కించుకుని మూడు గంటల తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. నేరం జరిగిన తర్వాత షెడ్డుకు ఆహారం, కొత్త బట్టలు, విద్యుత్ షాక్‌లు ఇచ్చేందుకు వాడిన మెగ్గర్ డివైజ్‌ను అక్కడి నుంచి తప్పించడం సహా ఇతర పనుల కోసం నిందితులు ఈ స్కూటర్లపై ప్రయాణించేవారనే సమాచారం మేరకు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!