New Delhi: రియల్ ఎస్టేట్ నుండి ఇంధనం వరకు వివిధ రంగాలలో వ్యాపారం చేసే హిరానందానీ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దర్శన్ హిరానందనీ, అదానీ గ్రూప్ గురించి పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మొయిత్రాకు డబ్బు ఇచ్చారని మహువా మోయిత్రా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తనపైన వస్తున్న ఆరోపణల పైన స్పందించిన దర్శన్ హీరానందాని తన అఫిడవిట్‌పై మౌనం వీడి మీడియాతో మాట్లాడారు. తాను మొయిత్రాకు వ్యతిరేకంగా నేను అఫిడవిట్ దాఖలు చేయలేదని ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాలేదని పేర్కొన్న ఆయన నిజం నిప్పులాంటిదని త్వరలోనే అందరి ముందు నిజం బయటకు పడుతుందనే నమ్మకముందని తెలిపారు.
Read also:Hamas-Israel war: సీసీ కెమెరాకు చిక్కిన హమాస్ క్రూరత్వం.. బయటపెట్టిన ఇజ్రాయిల్
మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై దర్శన్ హీరానందాని మాట్లాడుతూ, తాను పశ్చాత్తాపపడాల్సిన తప్పు చేశానని, ఇది తన కంపెనీ ప్రతిష్టను దిగజార్చిందని అన్నారు. అందువల్ల ఈ విషయంలో ఆయన ముందుకు వచ్చి మాట్లాడటం చాలా ముఖ్యమని ఈ ఆరోపణలో నిజమెంతో చెప్పాలనుకుంటున్నానని .. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని అయన తెలిపారు. ప్రశ్నలను అడగడానికి నేను నగదు ఇచ్చాను అనే ఆరోపణలు వచ్చినప్పుడే నేను ఆరోపణలపైనా స్పందించానని అయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. అయితే నగదు ఇచ్చాను అనే ఆరోపణలో వాస్తవం లేదని తెలిపారు. కాగా మహువా మొయిత్రా పార్లమెంటరీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ని నేను వాడిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అలానే ఆరోపణల స్వభావం తీవ్రమైనదని ఎందుకంటే ఈ ఆరోపణలు నిజమని తేలితే అది పార్లమెంటు అధికారాలను ఉల్లంఘించినట్లు అవుతుందని .. అదే జరిగితే నేను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయబడతానని ఆయన పేర్కొన్నారు.