Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- మోడీ కేబినెట్ నుంచి కేంద్రమంత్రి ఔట్
- కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా
- వెంటనే ఆమోదించిన రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. అనూహ్యంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేయడం.. ఆమోదించడం జరిగిపోయింది. ప్రధాని మోడీ సూచన మేరకు వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రవ్నీత్ సింగ్ రాజీనామాను ఆమోదించారు. ఆకస్మిక పరిణామంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రివర్గం నుంచి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి వెంటనే రాజీనామాను ఆమోదించారు.
రాజ్యసభ ఎంపీగా ఉన్న రవ్నీత్ సింగ్ పదవీకాలం జూన్‌లో ముగిసింది. మరోసారి అవకాశం దక్కలేదు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. అయితే పంజాబ్‌లో అధికారంలోకి వచ్చేందుకు రవ్నీత్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
పంజాబ్‌లో బీజేపీ వ్యూహంలో భాగంగానే జరిగినట్లుగా సమాచారం. ఓటర్లలోని నాలుగు వర్గాలైన హిందువులు, సిక్కులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)లపై దృష్టి పెట్టడం కోసమే ఇలానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లలో సిక్కులు అతిపెద్ద వర్గంగా ఉన్నారు. జనాభాలో దాదాపు 58 శాతం మంది వీరే. ఆ తర్వాత 39 శాతంతో హిందువులు ఉన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మత సమూహంగా ఉంది. పంజాబ్‌లోని ఓటర్లలో మూడవ వర్గం దళిత సమాజం. వీరు జనాభాలో దాదాపు 32 శాతం ఉన్నారు. ఆ తర్వాత ఓబీసీలు సుమారు 16 శాతంగా అంచనా వేయబడ్డారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!