Crime News: తమిళనాడు రాష్ట్రంలో సంచలన సంఘఠన చోటు చేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మలైకొట్టాళం గ్రామానికి చెందిన కొళంజి అనే వ్యక్తి తన భార్య గీతాతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, ఈ మధ్య భార్య గీతాకు అదే గ్రామానికి చెందిన తంగరసు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం కొళంజి తన ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా భార్య గీతా, ప్రియుడు తంగరసును ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దింతో ఆగ్రహానికి లోనైనా కొళంజి కత్తితో వారి ఇద్దరిపై రెచ్చిపోయాడు.
Astrology: సెప్టెంబర్ 12, శుక్రవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?
ఏకంగా వారిని కత్తితో హత్య చేశాడు. అంతేకాదు వారి రెండు తలలను ఒక బ్యాగులో వేసుకున్నాడు. ఆ తరువాత కొళంజి బస్సులో వేలూరు జైలు సమీపానికి వెళ్లి అక్కడి పోలీసులను ఆశ్చర్యపరిచాడు. ముందుగా కొళంజి జైలు బయట ఏమి చేయాలో తెలియక బయట తిరుగుతున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు అతడిని ప్రశ్నించగా.. వారికీ తన బ్యాగులోని రెండు తలలను చూపించి తానే హత్య చేశానని తనను జైల్లో పెట్టాలని కోరాడు. ఈ ఘటన పోలీసులను కూడా షాక్ కు గురిచేసింది. వెంటనే కొళంజిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి విచారణ ప్రారంభించారు.