Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.