దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4,54,465 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 16,159 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 28 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 15,39 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది
గడిచిన రోజు దేశంలో మొత్తంగా 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు పైగా పెరిగింది. దేశంలో కరోనా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇండియాలో 4,35,47,809 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 4,29,07,327 మంది కోలుకోగా.. 5,25,270 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది.
ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా చాలా వరకు కేసులను, మరణాలను అడ్డుకోగలుగుతున్నాం. ఇప్పటికే దాదాపుగా 80 శాతం ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,98,20,86,763 డోసులను అర్హులైన ప్రజలకు అందించారు. గడిచిన 24 గంటల్లో 9,95,810 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు కేంద్రం వెల్లడించింది.