PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- రాజ్యసభ చైర్మన్ సీపీ.రాధాకృష్ణన్‌ను అభినందించిన మోడీ
- వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మహిళలకు మోడీ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అన్ని పార్టీలు ఆయన్ను అభినందించాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మహిళలకు మోడీ అభినందనలు తెలిపారు. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
Also Read
గత వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున అనూహ్యంగా ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేశారు. దీంతో ఆయన వారసుడిగా మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీసీ.రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా కేంద్రం ఎన్నిక చేసింది. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున రాజ్యసభ ఛైర్మన్‌గా రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అందరూ ఆయన్ను అభినందించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి పరుగులు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు.
‘‘ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు’’ అని పేర్కొన్నారు. సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ కీలక ఉపాన్యాసం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. ఓటమి నిరాశకు యుద్ధభూమి కాదని.. మనం సమతుల్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని.. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్‌లో మంచి చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
#WATCH | Delhi: In Rajya Sabha, PM Narendra Modi says, "You (CP Radhakrishnan) were born in Dollar City, and it has its own identity. Despite this, you chose 'Antyodaya' as your field of service. You always cared for the oppressed, downtrodden, and marginalised families, even… pic.twitter.com/F6Zaef9ydf
— ANI (@ANI) December 1, 2025
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!