తమిళ, తెలుగు చిత్రాలలో తన ప్రత్యేక నటనతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సంగీత. అనతి కాలంలోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘పెళ్లాం ఊరెళితే’ నుంచి మొదలు పెడితే ‘ఖడ్గం’, ‘సంక్రాంతి’ వరకు – పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజంట్ అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక పోతే ఇప్పుడు సినిమా వార్తలతో కాకుండా వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా సంగీత వార్తల్లో నిలిచారు.
Also Read : Shwetha Menon : అశ్లీల చిత్రాలతో.. డబ్బు సంపాదిస్తోన్న మలయాళ నటి పై పోలీస్ కేసు!
ఈ మధ్య కాలంలో విడాకులకు ముందు సినీ తారలు లీక్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఇన్ స్టాలో పేరు తొలగించడం, తర్వాత విడాకులు ప్రకటించడం అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అన్న సంగతి తెలిసిందే. అయితే 2009లో సింగర్ క్రిష్, సంగీత వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. కాగా ఇప్పుడు సంగీత కూడా అదే పని చేశారట.. ఇన్ స్టాలో ఇన్ని రోజులు సంగీత క్రిష్ అని కనిపించేది. ఇప్పుడు కేవలం సంగీత అని మాత్రమే ఉందట. దీంతో సంగీత కూడా త్వరలోనే విడాకుల ప్రకటన ఏమైనా చేస్తుందా? అని అంతా అనుకుంటున్నారు. దీనిపై చాలా వార్తలు పుట్టుకొస్తున్నాయి. కానీ తాజాగా ఈ విషయంపై స్పందించిన సంగీత కుండ బద్దలు కొట్టింది..
‘ ఇది పూర్తిగా అబద్ధం. నేను మొదటి నుంచీ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నా పేరును ‘సంగీత యాక్టర్’గానే ఉంచుకున్నాను. వాస్తవానికి అది ఇప్పటికీ అలాగే ఉంది. మా ఆయనతో కలిసి సంతోషంగా ఉంటున్నా. ఈ రూమర్లపై స్పందించాల్సిన అవసరం లేదు కానీ.. మీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది’ అంటూ అభిప్రాయపడ్డారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.