PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..
- జూన్ 4న దేశాన్ని తగలబెట్టాలని అనుకున్నారు..
- రాహుల్ బెయిల్‌పై బయట ఉన్నారు..
- దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర..
- రాహుల్ గాంధీకి పరిపక్వత లేదు..
PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో విమర్శలు చేశారు. ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులను కూడా దాటేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో్ కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ఓ పాఠం నేర్పిందని చెప్పారు. ఎన్డీయేను ఓడించామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, వారు ఓటమిపై అంతర్మథనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మిత్ర పక్షాల సాయంతో కొన్ని సీట్లను గెలుచుకుందాని అన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదని చెప్పారు. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం 26 శాతమే అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరాన్నజీవి అని అన్నారు.
Read Also: Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు
Also Read
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ, ఆయన సభలో కన్నుకొడుతారు, కౌగిలించుకుంటారు, చిన్నపిల్లాడి మనస్తత్వమని, ఆయనకు పరిపక్వత లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తోందని, అలాంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చిందని అన్నారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించారు. వారు కోరుకున్న ఫలితాలు రాకుంటే జూన్ 4న దేశాన్ని తగలబెట్టాలని అనుకున్నట్లు పలు వేదికల నుంచి ప్రకటించిందని చెప్పారు. అరాచకాన్ని వ్యాప్తి చేయాలని చూశారని అన్నారు. భాషా ప్రాతిపదికన ఉత్తరాది, దక్షిణాదిని విభజిస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కూడా ఇదే విధంగా ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు.
సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాలకు కాంగ్రెస్ తెరతీసిందని ప్రధాని మోడీ అన్నారు. వేల కోట్ల అవినీతి కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై ఉన్నారని, ఓబీసీ ప్రజలను దొంగలన్న కేసులో బాధ్యతరాహిత్యంగా మాట్లాడినందుకు సుప్రీంకోర్టులో క్షమాపనలు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Karimnagar PMG Jewellery : పీఎంజీ జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!