Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం
- లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- సామర్థ్యానికి మంచి ప్రయాణించడంతో ఘోరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది ధృవీకరించారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బలూచిస్తాన్-ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రాల సరిహద్దులోని దానా సర్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది.
బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా మరో బస్సు మార్గమధ్యలో చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారు. దీంతో బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోయిందని తెలిపారు. అధిక లోడ్ కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!