Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనశక్తి జనతాదళ్ అభ్యర్థులను నిలబెట్టనుందని శుక్రవారం వెల్లడించారు. తన పార్టీ జనశక్తి జనతాదళ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. READ ALSO: Komatireddy Venkat Reddy : ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచేది…
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి… మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రణాళికలతో ముందుకు కదులుతోంది బీజేపీ.. ఇదే సమయంలో.. ఓ వైపు ప్రియాంక నేతృత్వంలో కాంగ్రెస్, మరోవైపు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ, మాయావతి నేతృత్వంలో బీఎస్పీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, సీఎం యోగి ఆదిత్యానాథే మరోసారి సీఎం అవుతారనే ప్రచారం కూడా ఉంది.. అంతేకాదు.. మోడీ తర్వాత అంతటి చరిష్మా ఉన్న యోగీయే నంటూ కొంతకాలం ప్రచారం సాగింది.. కానీ,…
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది.. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్కూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, బస్సులో ప్రయాణం.. కల్పిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. కాగా, ఇప్పటికే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రియాంక… తాజాగా ఉచిత హామీలను ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా.. తాము ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి…