PM Modi: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సత్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దానితో పాటు విధ్వంసాన్ని తెస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్‌కి రోడ్‌మ్యాప్ లేదని, మోడీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర యువతకు కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదని, మోడీ ఇచ్చిన హామీలపై రాష్ట్రానికి నమ్మకం ఉందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలను భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ.. మీ ఒక్క ఓటు ఢిల్లీలో మోడీకి బలాన్ని ఇస్తుంది, మీ ఒక్క ఓటు అవినీతి కాంగ్రెస్‌ని మధ్యప్రదేశ్ నుంచి తరిమికొడుతుందని అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే ఉచిత రేషన్, ఉచిత వైద్యం ఆగిపోతాయని అన్నారు.
Read Also: Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు..?
‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ మధ్యప్రదేవ్ బీజేపీ ప్రభుత్వానికి పనిచేయడానికి అడ్డంకులు సృష్టించింది, కాంగ్రెస్ ఎంపీని చీకట్లోకి నెట్టేసింది, ఇప్పుడు సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సమయం ఆసన్నమైంది. దళితులు, వెనుకబడిన వారు, గిరిజనులు, పేదలు, ప్రతీ ఒక్కరూ తమ హక్కులను పొందుతారు’’ అని ప్రధాని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 2జీ, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ స్కామ్ జరిగిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. బీజేపీ ఈ స్కాములను ఆపింది. 10 ఏళ్లలో 10 లక్షలను పేదల ఖాతాలకు పంపింది. ఉచిత రేషన్ పథకాన్ని తాము మరో 5 ఏళ్లు పొడగించామని అన్నారు. నవంబర్ 17న రాష్ట్రంలోని 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.