PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కేవలం మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 17న రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దశాబ్ధానికి పైనా పాలిస్తున్న బీజేపీని అధికారంలోకి దించేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ప్రచార దూకుడును పెంచింది. నవంబర్ 17న పోలింగ్ జరగనుంది, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
PM Modi: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సత్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దానితో పాటు విధ్వంసాన్ని తెస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్‌కి రోడ్‌మ్యాప్ లేదని, మోడీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
Madhya Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎలక్షన్ డ్యూటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడమే కాకుండా, షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఖంగుతినే సమాధానం వచ్చింది. ఈ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
Ayodhya Ram Mandir: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి అధికారం సాధించాలని బీజేపీ, గద్దె దించాలని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ రామమందిరంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎంపీతో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు నేడో రోపో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటివారం మధ్యలో పోలింగ్ జరిగే ఉందని సోర్సెస్ చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.
Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.