MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం
- తమిళనాడులో గవర్నర్-స్టాలిన్ సర్కార్ మధ్య రగడ
- అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడంపై అభ్యంతరం ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ప్రభుత్వానికి-రాజ్‌భవన్ మధ్య రగడ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నుంచి గవర్నర్ ఎన్.రవి అర్థాంతరంగా నిష్క్రమించారు. జాతీయ గీతానికి బదులు.. రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై అసంతృప్తి చెంది వెంటనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇలా జరగడంతో ఇది మూడోసారి. తాజా ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ఘాంతపోయింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ఘోరం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
తాజాగా ఇదే అంశంపై గవర్నర్ తీరును ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ పదవిని అవమానించారని ఆరోపించారు. గతంలో తమిళనాడు చాలా మంది గవర్నర్లను చూసిందని.. వారంతా రవి లాంటి వారు కాదని అన్నారు. గవర్నర్ చర్యలను విమర్శించాల్సిన పరిస్థితి తనకు వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత హయాంలో చూడని సంక్షోభాన్ని నేను ఎదుర్కొంటున్నాను. గవర్నర్ (రవి) అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో ప్రసంగాన్ని చదవకుండా.. అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో జాతీయ గీతం ప్లే చేయాలని పట్టుబట్టడం ద్వారా తన పదవిని అవమానిస్తున్నారు.’’ అని అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో స్టాలిన్ అన్నారు.
ఇది కూడా చదవండి: That One Penguin: సోషల్ మీడియాను కదిలిస్తున్న.. పూరి చెప్పిన ‘ఒక్క పెంగ్విన్’ కథ..
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగింపులో ఎల్లప్పుడూ జాతీయ గీతం వినిపించబడుతుందని, ప్రారంభంలో తమిళ మాతృ ప్రార్థన వినిపించబడుతుందని స్టాలిన్ అన్నారు. ‘‘దేశభక్తిలో మేము ఎవరికీ తక్కువ కాదు.. ఎవరూ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ సంక్షోభం తనకు కొత్త కాదు. నేను గతంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. వాటిని అధిగమించాను.’’ అని స్టాలిన్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?