తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే నేత పొన్ముడిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంపై గవర్నర్ ప్రవర్తనను ధర్మాసనం తప్పుపట్టింది.