ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ‘ఆ ఒక్క పెంగ్విన్’ (That One Penguin) గురించే చర్చ జరుగుతోంది. మంచు కొండల మధ్య తన తోటి పెంగ్విన్‌లను వదిలేసి, ఏకాకిగా కొండల వైపు వెళ్ళిపోతున్న ఒక పెంగ్విన్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి ఇది 15 ఏళ్ల క్రితం నాటి పాత వీడియో అయినప్పటికీ, ఇప్పుడు ఆకస్మికంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొదట చాలామంది దీనిని చూసి సరదాగా కామెంట్స్ చేసినా, దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిశాక నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
Also Read : Champion : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’..
అసలు కథ ఏంటీ అంటే.. ఈ పెంగ్విన్ వింత ప్రవర్తన వెనుక ఉన్న రహస్యాన్ని గతంలోనే దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో వివరించారు. పూరీ కథనం ప్రకారం.. మగ పెంగ్విన్‌లు తమ భాగస్వామి పట్ల అత్యంత నమ్మకంగా ఉంటాయట. కానీ, ఎప్పుడైనా ఆడ పెంగ్విన్ తనను మోసం చేస్తే (Cheating), ఆ బాధను మగ పెంగ్విన్ భరించలేదట. ఆ బ్రేకప్ తట్టుకోలేక తన జాతిని, ఆహారాన్ని ఇచ్చే సముద్రాన్ని వదిలేసి, ఎవరూ లేని కొండల వైపు వెళ్ళిపోతుందట. అలా ఏకాకిగా మారి, ఆకలితో అక్కడే నిలబడి ప్రాణాలు వదులుతుందట. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోని పెంగ్విన్ కూడా అచ్చం అలానే వెళ్ళిపోతుండటం చూసి, నెటిజన్లు ఆ పెంగ్విన్ ప్రేమ కథను తలచుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.