China Support Pak: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. అయితే, శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను పాక్ విదేశాంగ మంత్రి వివరించారు.
Read Also: Pakistan Economy: పాకిస్తాన్ బడ్జెట్ రిలయన్స్ ఆదాయంలో సగం!
అయితే, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణితో ఉందని పేర్కొన్నారు. తమ మిత్రదేశమైన పాక్కు బీజింగ్ మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, మరో వైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ పాకిస్తాన్ ఫారన్ మినిస్టర్ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితిని వారికి తెలియజేశారు. ఇక, పాక్ కి చైనా మద్దతు ఇవ్వడంతో భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు.