భారత్ పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను గడగడలాడించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ద్వైపాక్షిక ఒత్తిడి తెచ్చేందుకు నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,…
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు సరిహద్దులో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, భారత్ తన గగనతలాన్ని పూర్తిగా తెరిచింది. అనేక విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. దేశంలోని 32 విమానాశ్రయాలను తక్షణమే పౌర విమానాల కోసం తెరవాలని ఆదేశించారు. మే 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేయాలని భావించినప్పటికి పరిస్థితులు చక్కబడడంతో వీటిని తక్షణమే ప్రారంభిస్తామని…
PM Modi:పాకిస్తాన్ చర్చల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) తిరిగి పొందడం, ఉగ్రవాదుల అప్పగించపై మాత్రమే ఉంటుందని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది. "కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది.
PM Modi: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. రెండు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలతో సుదీర్ఘం మాట్లాడి కాల్పుల విమరణకు ఒప్పించినట్లు ఆయన ప్రకటించారు.
China Support Pak: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో గతంలోనూ ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు.. కానీ, అవి ఎంతో కాలం పని చేయలేదు.. కొద్ది రోజులకే పాక్ మళ్లీ కాల్పులకు దిగిందని పేర్కొంటున్నారు.