India-China: భారత అభ్యంతరాల నేపథ్యంలో సోమవారం చైనా ‘‘షక్స్‌గామ్’’ వ్యాలీపై కీలక ప్రకటన చేసింది. ఇది తమ భూభాగంలోని భాగమని చైనా చెప్పింది. ఈ ప్రాంతంలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ‘‘నిందకు అతీతమైనవి’’గా చెప్పింది. షక్స్‌గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న పనుల గురించి భారత్ శుక్రవారం విమర్శించింది. ఇది భారత భూభాగం కాబట్టి దాని ప్రయోజనాలనున కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది.
Read Also: Vijay: ‘‘కరూర్ తొక్కిసలాటకు బాధ్యత వహించం’’.. సీబీఐ విచారణలో విజయ్..
5,180 చదరపు కిలోమీటర్ల షక్స్‌గామ్ వ్యాలీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక భాగం. దీనిని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా 1963లో చైనాకు అప్పగించింది. ‘‘ షక్స్ గామ్ లోయ భారత భూభాగం. 1963లో చైనా-పాక్ సరిహద్దు ఒప్పందాన్ని గుర్తించము.’’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీన్ జైస్వాల్ అన్నారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)ను కూడా తాము గుర్తి్ంచమని, ఇది పాకిస్తాన్ బలవంతంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగం గుండా వెళ్తోందని ఆయన అన్నారు.
అయితే, భారత్ వ్యాఖ్యలకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ.. మీరు పేర్కొన్న ప్రాంతం చైనాలో భాగమని అన్నారు. చైనా తన సొంత భూభాగంలో మౌలిక సదుపాయాలను నిందించకూడదని ఆమె అన్నారు. చైనా, పాకిస్తాన్ 1960ల నుండి సరిహద్దు ఒప్పందంపై సంతకం చేశాయని, రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్ణయించాయని మావో చెప్పారు. సార్వభౌమదేశాలుగా మా రెండు దేశాలకు ఈ హక్కు ఉందని చెప్పారు. CPEC ద్వారా స్థానిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రజల జీవనోపాధి మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. CPEC కాశ్మీర్ సమస్యపై చైనా వైఖరిని ప్రభావివతం చేయమని, ఈ విషయంలో చైనా వైఖరి మాదని చెప్పింది. యూఎన్ చార్టర్, UN భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం కాశ్మీర్ సమస్య శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా చెబుతోంది.