Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…
Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ని, తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ రోడ్డు, రైలు నెట్వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) చేపట్టింది. ఇప్పటికే బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్‌ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా…
Pakistan: పాకిస్తాన్‌లోకి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేశాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది.
Pakistan: పాకిస్తాన్‌లో గత కొంత కాలంగా చైనీయులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి చైనీయులను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడినట్లు తెలుస్తోంది. తమ పౌరులకు భద్రత కల్పించాలని చైనా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. Read Also: Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అవిభాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది.
Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న గ్వాదర్ పోర్టులో కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పాక్ స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భద్రతా సిబ్బంది ప్రతిదాడుల్లో ఇద్దరు దుండగులు మరణించినట్లు తెలుస్తోంది. గ్వాదర్ పోర్టు అరేబియా సముద్రంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో నిర్మితమవుతోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఈ పోర్టును నిర్మిస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణాకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయతే, ఈ కాల్పుల గురించి గ్వాదర్ డిప్యూటీ కమిషనర్,…
China: చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్ తో మరింతగా సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) కోసం బిలియన్ల కొద్దీ డబ్బును ఖర్చు పెడుతోంది చైనా. ఇక ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ని కౌంటర్ చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ తో తన సంబంధాలు బలంగా ఉండాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని చైనీయులు ఇటీవల కాలంలో దాడుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
G20 Summit 2023: భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న జీ20 సదస్సు అనేక విధాలుగా చరిత్రాత్మకమైనది. సమ్మిట్ తొలిరోజు పలు కీలక ప్రకటనలు చేశారు. సమ్మిట్ ప్రధాన కార్యక్రమాలతో పాటు, భారతదేశం నుండి ఐరోపాకు వాణిజ్య మార్గాన్ని నిర్మించే కాన్సెప్ట్ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుందని అటువంటి ప్రకటన చేయబడింది.