India-China: భారత అభ్యంతరాల నేపథ్యంలో సోమవారం చైనా ‘‘షక్స్‌గామ్’’ వ్యాలీపై కీలక ప్రకటన చేసింది. ఇది తమ భూభాగంలోని భాగమని చైనా చెప్పింది. ఈ ప్రాంతంలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ‘‘నిందకు అతీతమైనవి’’గా చెప్పింది. షక్స్‌గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న పనుల గురించి భారత్ శుక్రవారం విమర్శించింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి 'లైవ్ ల్యాబ్'గా ఉపయోగించుకుందని అన్నారు.