Asaduddin Owaisi: లోక్‌సభలో ఓవైసీ ‘పాలస్తీనా’ నినాదం.. అనర్హత వేటు వేయొచ్చా.?
- లోక్‌సభలో అసదుద్దీన్ ఓవైసీ దుమారం..
- జై పాలస్తీనా అంటూ నినాదం..
- అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్..
- నిబంధనలు చూస్తానన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు. అయితే, దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి ఫిర్యాలు అందాయి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అతడిపై అనర్హత వేటు వేయాలని కోరారు. పరాయి దేశానికి విధేయత చూపించినందుకు ఓవైసీని అనర్హుడి ప్రకటించవచ్చని సూచించారు.
Read Also: Canada: ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఎంపీ వేరే దేశానికి కట్టుబడి ఉన్నందున లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడిగా బీజేపీ పేర్కొంది. మంగళవారం అసదుద్దీన్ ఓవైసీ 18వ లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేస్తూ ఈ నినానాలు చేశారు. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన జై పాలస్తీనా అంటూ నినదించారు. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. అయితే, ఓవైసీ తన చర్యను సమర్థించుకున్నారు. ఇలా అనడంతో తప్పులేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధలను లేవని చెప్పారు. పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదవండి అంటూ సూచించారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పాలస్తీనా ప్రస్తావనపై కొంతమంది సభ్యుల నుండి ఫిర్యాదులు అందాయని, వ్యాఖ్యలకు సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయో చూస్తానని అన్నారు. ‘‘పాలస్తీనాతో లేదా మరే ఇతర దేశంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఒకే విషయం ఏమిటంటే, ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ఏ సభ్యుడు మరొక దేశాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేయడం సరైనదేనా? మేము నిబంధనలను తనిఖీ చేయాలి. కొంతమంది సభ్యులు వచ్చి, ప్రమాణం ముగింపులో పాలస్తీనా నినాదం గురించి నాకు ఫిర్యాదు చేశారు’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!