BRS MPs: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MPs: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. స్పీకర్ పోడియంను BRS ఎంపీలు చుట్టుముట్టారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని లోక్ సభలో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో కాసేపు లోక్ సభ ఆందోళనతో దద్దరిల్లింది.
ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఆధాని షేర్ల అంశంపై నోటీస్ ఇచ్చామన్నారు. దేశ సమస్య పై చర్చ జరగాలి అని కోరామన్నారు. పబ్లిక్ మని ఇన్వాల్వ్ ఉందని తెలిపారు. చర్చ లేకుండా వెనక్కి వెళ్ళారని అన్నారు. ఏ సమస్య పై అయినా చర్చకు సిద్దం అంటారు.. కానీ చర్చించారన్నారు. Lic డబ్బుపై ఇంత జరుగుతున్నా, ప్రభుత్వ ప్రకటన లేదని మండిపడ్డారు. పార్లమెంట్ లో చర్చకు ముందుకు రావటం లేదని ఆరోపించారు. దేశ సమస్యపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చర్చ జరిగేందుకు మా పోరాటం కొనసాగుతోందని అన్నారు.
Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
Read also: Butcher Son: తల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు.. అలా చేసేందుకు ప్లాన్ వేశాడు
బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ రావు మాట్లాడుతూ.. నోటీసులు రాజ్యసభలో వాయిదా తీర్మానాలుగా ఇచ్చామన్నారు. అదాని సంస్థల్లో లక్షల కోట్లు పెట్టుబడులు కావడం, షేర్ల విలువ పడిపోవడంపై దర్యాప్తు జరపాలన్నారు. సభ ఆర్డర్ లో లేదని వాయిదా వేశారని అన్నారు. ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన చాలా సీరియస్ అంశమన్నారు. అదాని షేర్స్ 27 శాతం పడిపోయాయని, అదాని షేర్స్ వ్యవహారం పై జెపిసి లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని తెలిపారు. క్రోని కేపిటలిజం దేశాన్ని రూల్ చేస్తుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారు.. అందుకే ప్రభుత్వం స్పందించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వాయిదా తీర్మానానికి ఉన్న విలువ దేనికి లేదని అన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు. ప్రధాని మోడీ ముడుపులు కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మోడీ చెప్పేది ధర్మశాస్త్రాలు, Lic తో లింక్ లేని కుటుంబాలు లేవన్నారు.
గుజరాతీ వ్యాపారస్తుల కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. 28 రాష్ట్రాల్లో అసెంబ్లీ, కౌన్సిల్ లో తీర్మానాలు, అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తామన్నారు. జుడిషియల్ ఎంక్వయిరీ, లేదా జేపీసీ వేసి విచారణ జరపాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామన్నారు.
Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!