సరిగ్గా తాళి కట్టాల్సిన సమయంలో పెళ్లిపీఠల పై నుంచి పరారయ్యాడు ఓ యువకుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పలేక.. తాళి కట్టే వరకు తెచ్చుకున్న అతగాడు.. చివరి సమయంలో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ నిబంధనల మధ్య గ్రాండ్‌కు పెళ్లి ఏర్పాట్లు చేశారు పెద్దలు.. అంతా హడావుడి.. వధూవరుల తరఫు బంధువులు వచ్చేశారు.. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు మండపానికి చేరుకున్నారు.. తాళి కట్టే సమయం రానే వచ్చింది.. కానీ, వరుడు పరారయ్యాడు.. దీంతో.. పరువు పోతుందని భావించిన పెద్దలు.. పెళ్లి చూసేందుకు వచ్చిన మరో యువకుడిని ఒప్పించి అక్కడే పెళ్లి చేశారు.
పెళ్లి కొడుకుకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా.. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.. అన్ని ఏర్పాట్లు జరిగాయి.. వేదిక మీదకు కూడా వచ్చారు పెళ్లి కూతురు, పెళ్లి కొడురు.. దండలు మార్చుకున్నారు.. కానీ, తీరా తాళి కట్టే సమయానికి కనిపించకుండా పోయాడు.. కాసేపు అతడి కోసం వెతికిన పెద్దలు.. ఇష్టంలేకే పారిపోయినట్టు గుర్తించారు.. పెళ్లి ఆగిపోతే లేని ఇబ్బందులు వస్తాయని.. పెళ్లి ఆపకూడదని డిసైడ్ అయిన వధువు కుటుంబం.. పెళ్లికి వచ్చిన వారిలో ఎవరైనా వధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. అందులో ఓ వ్యక్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం అన్నీ అక్కడే జరిగిపోయి.. ఆ తర్వాత పెళ్లి జరిపించారు. మొత్తంగా.. అదే మండపంలో.. కాస్త లేట్‌గా పెళ్లి జరిగినా.. వరుడి స్థానంలో మాత్రం.. ఊహించకుండా అతిథి వచ్చి చేరాడన్నమాట.