Rajya Sabha: రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సభ్యులు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
- రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సభ్యులు
- మెజారిటీ మార్కు 113కి కంటే తక్కువ
- బీజేపీకి సొంతంగా 86 సీట్లే
- బిల్లులు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతుతోనే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది. రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది. అంటే మెజారిటీ మార్కు 113 కంటే తక్కువగా ఉంది. అయితే ఎన్డీఏకు ఏడుగురు నామినేటెడ్, ఒక స్వతంత్రుడి మద్దతు ఉంది. ఇక శనివారం నలుగురు నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం పూర్తి అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా ఎంపిక ఎన్నికైన వీరి పదవీకాలం ముగిసింది. దీంతో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో 86 మంది సభ్యులే ఉన్నారు. ప్రస్తుతం బిల్లులు ఆమోదం పొందాలంటే కచ్చితంగా వైసీపీ, అన్నాడీఎంకేపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. బిల్లులు ఆమోదించాలంటే మోడీ సర్కార్.. వైసీపీ మద్దతు తీసుకోవల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Balineni Srinivas Reddy: జనసేనలో చేరికపై బాలినేని క్లారిటీ..!
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ప్రస్తుతం బీజేపీకి 86 సీట్లు ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌కు 26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, వైసీపీకి 11, ఆప్, డీఎంకేకు చెరో 10 సీట్లు ఉన్నాయి. లోక్‌సభలో ఎంపీలు లేకపోయినా.. రాజ్యసభలో మాత్రం బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్.. ఆ ఫోటోలు షేర్ చేసిన రకుల్
ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మొత్తం 87 ఉన్నాయి. అందులో కాంగ్రెస్‌కు 26, బెంగాల్‌లోని అధికార తృణమూల్‌కు 13, ఢిల్లీ మరియు తమిళనాడులో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరియు డిఎంకేకు ఒక్కొక్కటి 10 ఉన్నాయి. ఇక తెలంగాణలోని బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు.
ప్రస్తుతానికి మొత్తం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్‌లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు త్రిపుర నుంచి ఏడు గెలిచే సంఖ్య ఉంది. ఇక మహారాష్ట్రలో సంఖ్యాబలం ఉంటే మరో రెండు గెలుచుకోవచ్చు. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ సభ్యుల ఓట్లతో పాటు వైఎస్సార్‌సీపీ ఓట్లతో గెలిస్తే మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత ఎక్కువగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌లో నాలుగు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30 లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KP Sharma Oli: నాలుగోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!