IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Weather Alert: రాష్ట్రాలను మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడటంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐసోలేటెడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ మల్టీ-డే వార్నింగ్ జారీ చేసింది.
మరోవైపు కేరళలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరిలు విరిగిపడటం, బురద మేటలేయడం (ముడ్ స్లైడ్స్), ఉవ్వెత్తున ఎగిసిపడిన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర అలజడి సృష్టించాయి. ఈ వర్షాల దాటికి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. వర్షాల తీవ్రత పెరుగుతుండటంతో పరిస్థితిని గంట గంటకూ సమీక్షించాలని ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ అధికారులను ఆదేశించారు. దీనిపై విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ విఘ్నేశ్వరి ఐఏఎస్.. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి ముందుస్తు జాగ్రత్తలను సమీక్షించారు. ప్రజలకు ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లు పంపడంతో పాటు, అవసరమైన చోట ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
వర్షాల ధాటికి ఇడుక్కి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొట్టకంబూర్ సమీపంలోని అమ్మన్ కోవిల్ ప్రాంతంలో వర్షం నుంచి బ్రతకడానికి ఒక పొలంలో ఉన్న షెడ్డులోకి ముగ్గురు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా భారీగా బురద విరిగిపడి ఆ షెడ్డుపై పడటంతో అది కూలిపోయి ముగ్గురు లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో బాలకృష్ణన్ (40), చిన్నూ (36) అనే ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, బాలకృష్ణన్ భార్య మరియమ్మ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ ప్రాంతంలో తవ్విన మట్టిని అక్కడే కుప్పగా పోయడం, దానికి తోడు భారీ వర్షం పడటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!