Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohit Sharma on Nitish Reddy: టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో నితీష్ రాణించడంతో అతడిని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా చూస్తున్నారని.. అయితే నితీష్‌ను ఇప్పుడే హార్దిక్‌తో పోల్చడం సరికాదని మోహిత్ అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో నితీష్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంతితో ఆకట్టుకున్నాడు. దీంతో అతడు భారత వైట్‌బాల్ జట్టులో పాండ్యాకు ప్రత్యామ్నాయంగా ఎదగగలడనే చర్చ మొదలైంది. అయితే నితీష్‌పై అంచనాలను హార్దిక్ స్థాయికి తీసుకెళ్లడం సరికాదని మోహిత్ సూచించాడు.
క్రికెట్ అడిక్టర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహిత్ శర్మ మాట్లాడుతూ… నం పదేపదే హార్దిక్ పాండ్యా పేరు తీసుకుంటున్నాం. కానీ ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డిని హార్దిక్‌తో పోల్చలేం. అలా పోల్చడం వల్ల నితీష్ కూడా హార్దిక్ లాగే బ్యాటింగ్, బౌలింగ్ చేయాలని మన అంచనాలు పెరిగిపోతాయి. నితీష్ బ్యాటింగ్ శైలి హార్దిక్‌కు భిన్నంగా ఉంటుంది. హార్దిక్ తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడగలిగే మ్యాచ్ విన్నర్. నితీష్ మాత్రం క్రీజులో కుదురుకున్న తర్వాత పెద్ద షాట్లు ఆడే బ్యాటర్’ అనిపేర్కొన్నాడు.
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
‘’నితీష్‌పై మన అంచనాలను తగ్గించుకోవాలి. అతడి ఆటతీరు భిన్నంగా ఉంటుంది. క్రీజులోకి వచ్చిన వెంటనే సిక్సర్లు కొట్టడం కంటే.. ముందుగా సెట్ అయిన తర్వాత భారీ షాట్లు ఆడగలిగే బ్యాటర్ అతడు. కాబట్టి మన అంచనాలు కూడా అతడి ప్రతిభకు తగ్గట్టుగానే ఉండాలి. అతడి టాలెంట్‌కు అనుగుణంగా ఉపయోగించుకోవాలి’ అని మోహిత్ శర్మ సూచించాడు. భారత వైట్‌బాల్ జట్టులో హార్దిక్ కీలకమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడికి జట్టు కూర్పులో ప్రత్యేక స్థానం కల్పించింది. కీలక సమయాల్లో బ్యాటింగ్, బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు హార్దిక్ ఖాతాలో ఎన్నో ఉన్నాయి. నితీష్ ప్రస్తుతం తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే దశలో ఉన్నాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో మరింత నిలకడ సాధించాల్సిన అవసరం ఉంది. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో నితీష్ తన సత్తా చాటేందుకు అవకాశం దక్కనుంది.
మాజీ భారత కెప్టెన్ అజింక్య రహానే మాత్రం నితీష్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. తొలి ఓవర్లోనే వికెట్ తీయగల సామర్థ్యం నితీష్‌కు ఉందని పేర్కొన్నాడు. ‘నితీష్ తొలి ఓవర్లోనే వికెట్ తీయగల బౌలర్. ఆ నైపుణ్యం అతడిలో ఉంది. బంతిని చేతి నుంచి బాగా విడుదల చేస్తాడు. మనం ఊహించిన దానికంటే కాస్త వేగంగా బౌలింగ్ చేస్తాడు. బంతి పిచ్‌పై పడిన తర్వాత వేగంగా దూసుకెళ్తుంది. కొత్త బంతితోనూ, పాత బంతితోనూ బౌలింగ్ చేయగల ఇలాంటి ఆల్‌రౌండర్ కెప్టెన్‌కు మంచి ఆప్షన్’ అని రహానే తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!