Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్‌పై మమతను ప్రశ్నించిన బీజేపీ
- కొనసాగుతున్న ఈ-సిగరెట్ వివాదం
- పార్లమెంట్‌లో టీఎంసీ ఎంపీలు తాగుతున్నారని బీజేపీ ఆరోపణ
- తాజాగా వీడియో షేర్ చేసిన ప్రదీప్ భండారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో ఈ-సిగరెట్ వివాదం ఇంకా కొనసాగుతోంది. గత వారం బీజేపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లోపల ఈ-సిగరెట్ తాగేందుకు అనుమతి ఉందా? అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా స్పీకర్ లేదని చెప్పారు. అయితే పార్లమెంట్ లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ధూమపానం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే బీజేపీ ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏ మాత్రం భావ్యం కాదని సూచించారు.
ఇది కూడా చదవండి: Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్‌కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
తాజాగా పార్లమెంట్ లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ-సిగరెట్ తాగుతున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వీడియోను పోస్ట్ చేశారు. పార్లమెంటు లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వాపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘‘ఇది నేరం! ఇది ప్రజాస్వామ్య ఆలయాన్ని అవమానించడం! మమతా బెనర్జీ స్పందించాలి. ఆమె ఎంపీలు భారత ప్రజల ముందు ఎలాంటి విధానాన్ని చూపిస్తున్నారు?.’’ అని రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఇథియోపియాలో మోడీకి ప్రత్యేక గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం
కీర్తి ఆజాద్ స్పందిస్తూ… పార్లమెంట్ ఆవరణలో ధూమపానం చేసే వందలాది మంది పార్లమెంట్ సభ్యుల పేర్లను తాను చెప్పగలనన్నారు. కానీ తాను అంత స్థాయికి దిగజారకూడదనుకుంటున్నాని చెప్పారు. ఒక బీజేపీ ఎంపీ MPLADS పై 30 నుంచి 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తే దానికి సమాధానం లేదన్నారు. ఎవరైనా సభ నియమాలు, విధానాలు తెలుసుకోవాలని.. ఏదైనా ఆరోపణలు చేసే ముందు స్పీకర్‌కు తెలియజేయాలని కీర్తి ఆజాద్ చెప్పుకొచ్చారు.
TMC MP KIRTI AZAD VIDEO VAPING INSIDE PARLIAMENT
This is a crime!
This is an insult of Temple of Democracy!
Mamata Banerjee should respond- What example are her MPs setting in front of people of India? pic.twitter.com/M4mAoJKL9H
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) December 17, 2025
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!