KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- KCC రుణాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం
- జనవరి 2026 నుంచి కొత్త రూల్స్
- కిసాన్ క్రెడిట్ కార్డ్‌లో తాకట్టు నిబంధనలపై ఆర్బీఐ సడలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (IRAC) నిబంధనలకు అనుగుణంగా పంట కాలం (Crop Season) నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది.
కొత్త నిబంధనల ప్రకారం:
స్వల్పకాలిక (Short-Term) పంటలకు పంట కాలం 12 నెలలుగా నిర్ణయించారు.
దీర్ఘకాలిక (Long-Term) పంటలకు పంట కాలం 18 నెలలుగా నిర్ణయించారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం.. నార్త్ బ్లాక్‌కు 6 ఫైర్ ఇంజిన్లు!
- Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం..
- Jamia University: జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్ష ముగింపు.. ఎన్నికలపై కీలక ప్రకటన!
పంటను సాగు చేయడం నుంచి కోత కోయడం, మార్కెట్లో విక్రయించడం వరకు ఉండే మొత్తం వ్యవధిని పంట కాలంగా పరిగణిస్తారు.
అసురక్షిత రుణాల పరిమితి పెంపు లేదు
కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద అసురక్షిత (Unsecured) రుణాల పరిమితిని మరింత పెంచాలని వచ్చిన ప్రతిపాదనలను ఆర్బీఐ తిరస్కరించింది. ఇప్పటికే 2024 డిసెంబర్లో పెంచిన పరిమితిని కొనసాగిస్తామని, ప్రస్తుతం మరింత పెంపుపై ఎలాంటి నిర్ణయం లేదని స్పష్టం చేసింది.
రూ.2 లక్షల వరకు గ్యారంటీ అవసరం లేదు
రైతులకు ఉపశమనం కలిగించేలా ఒక్కో రుణగ్రహీతకు రూ.2 లక్షల వరకు ఇచ్చే వ్యవసాయ రుణాలపై గ్యారంటీ, మార్జిన్ మనీ, అదనపు సెక్యూరిటీ నిబంధనలను బ్యాంకులు మాఫీ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఈ సడలింపు వ్యవసాయ సంబంధిత ఇతర అవసరాల కోసం తీసుకునే రుణాలకు కూడా వర్తిస్తుంది.
రూ.3 లక్షల వరకు తాకట్టు మినహాయింపు అవకాశం
కొత్త మార్గదర్శకాల ప్రకారం, పంటలు లేదా పశుసంపద ఆధారంగా తీసుకునే కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల విషయంలో రూ.3 లక్షల వరకు తాకట్టు (Collateral) నిబంధనను బ్యాంకులు మాఫీ చేసే అవకాశం కల్పించారు. అయితే, దీనిపై తుది నిర్ణయం ఆయా బ్యాంకుల రుణ విధానాల ఆధారంగా ఉంటుంది.
రుణ పరిమితుల సమీక్ష
పంట సాగు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం మంజూరు చేసే స్వల్పకాలిక రుణ పరిమితులను బ్యాంకులు కాలానుగుణంగా సమీక్షించి, అవసరమైతే పునరుద్ధరించాలని ఆర్బీఐ సూచించింది.
రైతులకు ఎలా ఉపయోగపడుతుంది?
ఈ మార్పుల వల్ల:
వ్యవసాయ రుణాల ఆమోదం వేగవంతం అవుతుంది.
రుణ చెల్లింపు షెడ్యూళ్లలో స్పష్టత వస్తుంది.
చిన్న, మధ్య తరహా రైతులకు రుణాలు సులభంగా లభిస్తాయి.
గ్యారంటీ, తాకట్టు భారం కొంత మేర తగ్గుతుంది.
వ్యవసాయ రంగానికి అవసరమైన క్రెడిట్ అందుబాటు మెరుగుపడుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో ఆర్బీఐ తీసుకొచ్చిన తాజా మార్పులు రైతులకు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పంట కాలం ప్రామాణీకరణ, గ్యారంటీ, తాకట్టు నిబంధనల్లో సడలింపులు రైతుల రుణ లభ్యతను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ రంగానికి బలాన్నిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- Farmers
- Kisan Credit Card
- RBI
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం.. నార్త్ బ్లాక్‌కు 6 ఫైర్ ఇంజిన్లు!
-
AP Local Elections 2026: జెడ్పీ స్థానాలపై కూటమిలో ఉత్కంఠ.. మరో రెండు కావాలంటూ జనసేన డిమాండ్!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!