Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faf du Plessis: క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఈ వెటరన్ స్టార్.. సియాటెల్ ఓర్కాస్‌పై మెరుపు శతకంతో చెలరేగాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకోవడంలో డు ప్లెసిస్ వీరోచిత ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ఇక, ఈ ఇన్నింగ్స్ ద్వారా ఫాఫ్ డు ప్లెసిస్ 41 సంవత్సరాల 340 రోజుల వయసులో సెంచరీ మార్కును అందుకొని, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత వృద్ధ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ వయసులో కూడా ఏకంగా 217 స్ట్రైక్ రేట్‌తో ఆడిన తీరు క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. టీ20 ఫార్మాట్లో తన క్లాస్ ఏంటో డు ప్లెసిస్ ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి ప్రపంచానికి నిరూపించాడు.
టాస్ గెలిచిన టెక్సాస్ సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఈ నిర్ణయం మొదట్లో ఆ జట్టుకు శాపంగా మారినట్లు కనిపించింది. సియాటెల్ ఓర్కాస్ బ్యాటర్లు ఊచకోత కోస్తూ బోర్డుపై 220 పరుగుల భారీ స్కోరును ఉంచారు. ఆ జట్టు ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ కేవలం 66 బంతుల్లోనే 104 పరుగులతో విరుచుకుపడగా, మరో ఓపెనర్ షయాన్ జహంగీర్ 47 బంతుల్లో 78 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ ఫ్రాంచైజీ లీగ్ చరిత్రలోనే ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విధ్వంసంతో సియాటెల్ జట్టు లీగ్‌లో పటిష్ట స్థితికి చేరుకుంది.
Also Read
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
భారీ లక్ష్య ఛేదనలో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ సాయితేజ ముక్కామళ్ల.. జస్దీప్ సింగ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డు ప్లెసిస్, మరో బ్యాటర్ రీలీ రూసోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అత్యంత కీలకమైన 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టెక్సాస్ జట్టును రేసులో నిలిపారు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో రూసో అవుట్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత టెక్సాస్ జట్టు మిడిలార్డర్లో చిన్నపాటి కుప్పకూలింది. మిలింద్ కుమార్ 13 పరుగులు, శుభమ్ రంజనే 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డు ప్లెసిస్ మాత్రం మొక్కవోని దీక్షతో ఒంటరి పోరాటం చేస్తూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి వియాన్ ముల్డర్ నుంచి మంచి మద్దతు లభించింది. ముల్డర్ కేవలం 15 బంతుల్లోనే 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో టెక్సాస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ అద్భుత ప్రదర్శనతో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఈ సీజన్ లీగ్‌ను ఘన విజయంతో ప్రారంభించింది.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?