Maa Inti Bangaaram Day 1 Collections : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ డే కలెక్షన్స్… అనుష్క, రష్మిక సినిమాలను మించిన వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Inti Bangaaram Day 1 Collections : ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయనే చర్చ జరుగుతున్న సమయంలో సమంత రూత్ ప్రభు నటించిన ‘మా ఇంటి బంగారం’ తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఉండగా, ఆ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు నుంచి సినిమా బలమైన వసూళ్లను నమోదు చేసింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.5.35 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ.6.20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 2,658 షోలతో ఈ చిత్రం సగటున 36 శాతం ఆక్యుపెన్సీ సాధించడం విశేషంగా మారింది. ఈ వసూళ్లతో సమంత తన కెరీర్లోనే సోలో హీరోయిన్గా అత్యధిక తొలి రోజు కలెక్షన్లు సాధించిన ఘనతను అందుకుంది. గతంలో విడుదలైన ‘యశోద’ మొదటి రోజు రూ.3.06 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేయగా, ‘మా ఇంటి బంగారం’ ఆ రికార్డును గణనీయమైన తేడాతో అధిగమించింది. అంతేకాదు, 2019లో సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబీ’ తొలి రోజు సాధించిన రూ.2.5 కోట్లను కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది.
Also Read
కేవలం సమంత కెరీర్ రికార్డులే కాదు, ఇటీవల విడుదలైన ఇతర స్టార్ హీరోయిన్ల లేడీ ఓరియెంటెడ్ చిత్రాల రికార్డులు కూడా ఈ సినిమా ముందు నిలవలేకపోయాయి. అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి’ తొలి రోజు రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రూ.1.30 కోట్లతో ప్రారంభమైంది. ఆ రెండు చిత్రాల కంటే రెట్టింపు స్థాయిలో ‘మా ఇంటి బంగారం’ వసూళ్లు నమోదు చేయడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ స్పష్టంగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. తొలి రోజే రూ.10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, విదేశీ మార్కెట్లో కూడా మంచి స్పందన అందుకుంది. ఓవర్సీస్లో రూ.4.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. శని, ఆదివారాలు వీకెండ్ సెలవులు కావడం, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరు అందించిన కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి కలసి నిర్మించారు.
- Tags
- cinema
- Maa Inti Bangaaram
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..