చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హస్తిన పాలిటిక్స్ వేడెక్కాయి. అధికార పార్టీ-బీజేపీ మధ్య సై అంటే సై అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. నిన్నామొన్నటిదాకా కేజ్రీవాల్ బ్యానర్ల పాలిటిక్స్ నడిచాయి. తాజాగా ఢిల్లీ ప్రథమ పౌరుడిని కమలనాథులు టార్గెట్ చేశారు.
ఇది కూడా చదవండి: Social media rules: “పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి”.. సోషల్ మీడియాపై కేంద్రం సంచలనం..
ఢిల్లీ మేయర్ మహేష్ ఖిచి భార్యకు రెండు చోట్ల ఓటర్ నమోదు చేసుకున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు చేశారు. డబుల్ ఓటు నమోదుపై చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మేయర్ భార్య.. ఒకే చిరునామాలో.. ఒకే ఫొటోతో రెండు వేర్వేరు పేర్లతో ఓటరుగా నమోదైందని బీజేపీ అధికార ప్రతినిధి శుక్రవారం లేఖలో ఆరోపించారు. కరోల్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో ‘నిధి’ అని పేర్కొనగా.. అదే చిరునామాలో మరో పేరుగా ‘మమత’ అని పేర్కొన్నారు. దీంతో మేయర్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారంటూ కాషాయ పార్టీ నేతలు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: China Dam: బ్రహ్మపుత్రపై చైనా ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్.. భారత ఆందోళనలు ఏమిటి.?
బీజేపీ ఆరోపణలపై మేయర్ మహేష్ ఖిచి స్పందించారు. తనకు నిధి అనే ఒక భార్యనే ఉందని తెలిపారు. మమత ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఆ పేరు మీద చిరునామా ఎలా నమోదైందో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇది అధికారుల పొరపాటు అని.. బీజేపీ లేవనెత్తే వరకు ఈ విషయం తెలియదని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘమే ఓటర్ల లిస్టును సరిచేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: Viral News: ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు సింహం బోనులోకి ప్రేమికుడు.. చివరికీ..(వీడియో)