China Dam: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పరిణామం భారత్‌కి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చైనా యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించింది. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్యామ్ దీనికి మూడు రెట్లు పెద్దదిగా ఉంటుందని. నాసా ప్రకారం.. త్రీగోర్జెస్ డ్యామ్ భారీ నిర్మాణం భూమి భ్రమణాన్ని ఏకంగా 0.06 సెకన్లు తగ్గించింది. అయితే, ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న కొత్త డ్యామ్ అత్యంత సున్నితమైన టిబెట్‌లోని హిమాలయాల్లో నిర్మిస్తోంది. ఇది భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది.
ఈ డ్యామ్ పర్యావరణంతో పాటు, అత్యధిక భూకంపాలు సంభవించే సిస్మోక్ జోన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా పెలుసుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో డ్యామ్ నిర్మించడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. టిబెన్‌లో యార్లంగ్ త్సాంగ్పొగా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. దీనిపై చైనా మెగా ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ప్రకటించిన వెంటనే, భారత్ తన అభ్యంరాలను తెలిపింది. ఈ రోజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘మా ప్రయోజనాలను కాపడుకుంటాం’’ అని చెప్పింది. నది జలాలపై భారత్ హక్కుల గురించి చైనాకు చెప్పినట్లు తెలిపింది.
Read Also: Syria: అస్సాద్ అరచకాలకు సాక్ష్యంగా ‘‘సైద్నాయ జైల్’’.. ఉప్పుగదులు, శ్మశానవాటికలు, శవాగారాలు..
ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న భారతదేశంపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. విపరీతమైన కరువు లేదా వరదల కారణంగా దిగువన భారత్‌లో ఉన్న 10 మిలియన్ల మంది ప్రభావితమవుతారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతుంది. జల విద్యుత్ ప్రాజెక్ట్ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత్, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు గురించి చైనా ఏం చెబుతోంది..?
ఈ డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్‌గా మారుతుంది. ఈ ప్రాజెక్టుని బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న టిబెటన్ పీఠభూమి తూర్పు అంచున నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చైనా14వ పంచవర్ష ప్రణాళికలో భాగం.. ప్రతీ ఏడాది 300 బిలియన్ Kwh విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రాజెక్ట్ వ్యయం 137 బిలియన్ డాలర్లుగా అంచనా. త్రీగోర్జెస్ డ్యామ్ ద్వారా చైనా 88.2 బిలియన్ kWh విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. తాజాగా నిర్మించబోయే డ్యామ్ దీనికి మూడు రెట్లు విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుంది.