Social media rules: పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023’’ ముసాయిదా నిబంధలన ప్రకారం.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 18 వరకు వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురాబోతోంది.
Read Also: China Dam: బ్రహ్మపుత్రపై చైనా ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్.. భారత ఆందోళనలు ఏమిటి.?
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY), తన నోటిఫికేషన్‌లో, MyGov.in ద్వారా ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలను సమర్పించడానికి ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 18, 2025 వరకు వీటిని స్వీకరిస్తారు. కొత్త రూల్స్ పిల్లల వ్యక్తిగత డేటాని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. డేటా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ వ్యక్తిగ వివరాలను నిర్వహించడానికి ముందు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
డేటా రక్షణ కోసం ముసాయిదా నిబంధనలలో కేంద్రం “పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే ముందు డేటా సేకరణ సంస్థ ద్వారా తల్లిదండ్రుల ధృవీకరించదగిన సమ్మతిని పొందాలి” అని పేర్కొంది. తల్లిదండ్రులు ఆమోదించారని నిర్ధారించే వరకు సంస్థలు పిల్లల వ్యక్తిగత డేటాను ఉపయోగించడం లేదా నిల్వ చేయడం ప్రారంభించలేరు. పిల్లల డేటాపై దృష్టి సారించడంతో పాటు, ముసాయిదా నియమాలు మెరుగైన వినియోగదారుల హక్కులను ప్రతిపాదిస్తాయి, వినియోగదారులు తమ డేటాను తొలగించాలని డిమాండ్ చేయడానికి మరియు వారి డేటాను ఎందుకు సేకరిస్తున్నారనే దాని గురించి తెలుసుకునే పారదర్శకతను అనుమతిస్తుంది. వీటిని ఉల్లంఘిస్తే రూ. 250 కోట్ల వరకు పెనాల్సీని ప్రతిపాదించారు.